టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రెండో రోజు గాంధీ భవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు శుక్రవారం స్వీకరించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రొహిన్ రెడ్డి, బొజ్జి శత్రురావు పాల్గొన్నారు.