కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ వంటి పథకాలు పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఎంతగానో ఉపయోగపడతాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం హిమాయత్ నగర్ లోని ఎమ్మార్వో కార్యాలయంలో లబ్దిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లక్ష చెక్కుతో పాటు తులం బంగారం త్వరగా అందజేయాలని డిమాండ్ చేశారు.