ఐ జె యు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా మోతె వెంకట్ రెడ్డి

148பார்த்தது
ఐ జె యు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా మోతె వెంకట్ రెడ్డి
మేడ్చల్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మోతె వెంకట్ రెడ్డి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నియ్యారు. చెన్నయ్ లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఐ జె యు జాతీయ మహా సభలలో ఐజెయు నూతన కమిటీనీ ఎన్నుకున్నారు. ఇందులో జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా వెంకట్ రెడ్డి కి స్థానం కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సంక్షేమం, హక్కుల కోసం దేశ వ్యాప్తంగా నిర్విరామ పోరాటం చేస్తున్న ఏకైక యూనియన్ ఐజెయు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉన్న జర్నిస్టుల సమస్య లను ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி