మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి కిష్టాపూర్ లో ఉన్న సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలను సోమవారం జిల్లా కలెక్టర్ గౌతం సందర్శించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, టాయిలెట్స్, లీకేజీలు, కిచెన్ షెడ్ తదితర పనులను చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గురుకులంలో అవసరమైన అన్ని పనులు చేయించుకోవాలని ఆయన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లలిత, అధికారులకు సూచించారు.