దుండిగల్ మున్సిపల్ పరిధిలో కత్వా చెరువు, పోతిన్ కుంట, నేరెళ్ల నాలా, మల్లంపేటలోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాస్ ను సోమవారం హైడ్రా బృందం పరిశీలించింది. నాలాలు, చెరువులు కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించారన్న ఆరోపణలతో హైడ్రా బృందం, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. అక్రమంగా వెలసిన నిర్మాణాలపై చర్యలు తప్పవనే సంకేతాలు వినిపిస్తున్నాయి.