ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మంగళవారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కార్తీక మాసం సందర్భంగా శివపురిలోని శివాలయాన్ని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పూజారులు ఎమ్మెల్యేలు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. పరమేశ్వరుని దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.