ముఖ్యమంత్రి సహాయ నిధితో ఎంతో మంది నాణ్యమైన ఉచిత వైద్య సేవలు పొందారని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో వెంకటాపురం డివిజనకు చెందిన చలపతికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్డీసీని ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన ఆరోగ్యానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు త్వరగా మంజూరు అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు.