జి. హెచ్. ఎం. సి కమీషనర్ ఇల్లంబర్తిని కలిసి ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన స్కీంలో అప్లై చేసుకున్న వారి వెరిఫికేషన్స్ పూర్తి చేసి సంబంధిత జిల్లా కలెక్టర్ కి పంపాలని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ కోరారు. ఆధార్ కార్డు లో హైదరాబాద్ అని ఉన్నవారి అప్లికేషన్స్ హైదరాబాద్ కలెక్టర్ వద్ద ఆగిపోయినాయని, వాటిని సమన్వయము చేసుకోవాలని అధికారులను కోరడం జరిగింది. సానూకూలంగా స్పందించిన కమీషనర్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అడిషనల్ కమీషనర్ చంద్రకాంత్ ని పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.