మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివ లింగానికి మంగళవారం ఓ వానరం మొక్కింది. స్వామి దర్శనానంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేసి అలంకరించారు. ఆ సమయంలో ఓ కోతి తన్మయత్వంతో శివలింగానికి మొక్కడం భక్తులను ఆకర్షించింది.