వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

64பார்த்தது
వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
బాతుల చెరువులో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామని హయ తనగర్ డివిజన్ కార్పొరేటర్ నవజీవన్రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని బాతుల చెరువు వద్ద జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను బుధవారం ఆయన సర్కిల్ డీసీ తిప్పర్తి యాదయ్యతో కలిసి పరిశీలించారు. చెరువు వద్ద శానిటేషన్ పనులు నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. చెరువు చుట్టూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி