ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా కూకట్ పల్లిలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు వారి నివాసం నుంచి రామాలయంకు పాదయాత్ర ద్వారా వచ్చి స్వామి వారికి తలంబ్రాలు సమర్పించారు. విద్యుత్ దీపాలంకరణలతో రకరకాల పుష్పాలతో రామాలయం దేదీప్యమానంగా అలంకరించినట్లు తెలిపారు. 436 ఏళ్ల చరిత్ర గల రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.