కూకట్పల్లి నియోజకవర్గ ముసాపేటకు చెందిన నూకరాజు కుడి కాలుకు ఇన్ఫెక్షన్ వల్ల చికిత్స కోసం కేపీహెచ్బీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందాడు. అతడు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకోగా గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేశ్ ద్వారా రూ. 18, 500 విలువైన చెక్కును అందజేశారు.