అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ లైన్ వేయడానికి మట్టిని తవ్వుతున్న క్రమంలో మట్టి పెళ్లలు పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కూకట్పల్లి పిఎస్ పరిధిలోని రంగనాయక స్వామి ఆలయ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. హానర్స్ అనే నిర్మాణ సంస్థ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయడానికి తవ్వకాలు ప్రారంభించింది. ఈ క్రమంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో మట్టి పెల్లలు పడి బీహార్‌కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే చెందాడు.