కూకట్పల్లిలో వామపక్ష పార్టీ నేతల ధర్నా
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసరాల ధరలను తగ్గించాలని కోరుతూ సోమవారం మూసాపేట్ వై జంక్షన్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ వామపక్ష పార్టీలకు చెందిన నేతలతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను ఆపాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా నిత్యావసర సరకులు ఆకాశాన్ని అంటుతున్న వేళ వాటిపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.