కూకట్పల్లి డిపో మేనేజర్ హరిని సిపిఐ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రశాంత్ నగర్ బస్సు ప్రాంగణంలో దివ్యాంగుల కోసం బస్సు పాస్ కౌంటర్‌ను ప్రారంభించాలన్నారు. డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో భాగంగా విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కూకట్పల్లి డిపో మేనేజర్ హరి ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో మంగళవారం దివ్యాంగుల కోసం బస్సు పాస్ కౌంటర్‌ను ప్రారంభించి మొదటి బస్ పాస్‌ను శివకు అందించారు.