తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పండుగ 'బతుకమ్మ'. ప్రకృతిని, పువ్వులను దేవతలుగా కొలుస్తూ తొమ్మిది రోజులపాటు కొనసాగే బతుకమ్మ సంబురాల సందడి మొదలైంది. సబ్బండ వర్గాలు ఏకత్వ స్ఫూర్తిని చాటుతూ అంగరంగ వైభవంగా నిర్వహించే పూలపండగ బుధవారం నుంచే ప్రారంభం కాబోతోంది. దుర్గా నవరాత్రులతోపాటు కొనసాగే ఈ వేడుకలను తమ పుట్టింట్లో జరుపుకోవడానికి మహిళలు గ్రామాలు, పట్టణాలకు చేరుకుంటున్నారు.