సోమాజిగూడ: సమగ్ర కుటుంబ సర్వే.. గవర్నర్ వివరాల సేకరణ
సామాజిక సాధికారత కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర సర్వేలో భాగంగా కుటుంబాల వివరాలను నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది శనివారం సోమాజిగూడలోని రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వివరాల సేకరణతో అధికారులు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. ప్రణాళిక సంఘం ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, జిల్లా కలెక్టర్ అనిదీప్ తదితరులు పాల్గొన్నారు.