కులగణన సర్వేను మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తెలిపారు. గురువారం అంబర్ పేట్ లో ఆయన మాట్లాడుతూ.. సర్వేను రాష్ట్రంలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.