మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు, మహిళా నేతలతో కలిసి శనివారం అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావును అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఫ్రీ బస్సు పథకంపై విమర్శలు చేసే సమయంలో మహిళలను కించపరచడంతో మహిళా కమిషన్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.