యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. గాంధీనగర్ కి చెందిన కె.కల్పన ఫిర్యాదును
విచారించిన హైదరాబాద్-1 కమిషన్ రూ. లక్ష పరిహారం, రూ.10,000 కేసు ఖర్చులు చెల్లించాలని ప్రతివాద బ్యాంకును ఆదేశించింది. పోగొట్టిన
సేలీడ్ డాక్యుమెంట్ నంబరు ఆధారంగా డూప్లికేట్ ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తెప్పించి ఇవ్వాలని పేర్కొంటూ 45 రోజులు గడువు
విధించింది.