మల్లయోధుడు విజయ్ కుమార్ యాదవ్ మరణం పట్ల సంతాపం

1231பார்த்தது
మల్లయోధుడు విజయ్ కుమార్ యాదవ్ మరణం పట్ల సంతాపం
మల్లయోధుడు, యాదవ మహాసభ సీనియర్ నేత బి. విజయ్ కుమార్ యాదవ్ మరణం పట్ల అఖిల భారత యాదవ మహాసభ సంతాపం ప్రకటించింది. ఆయన మరణం బడుగు బలహీన వర్గాలకు తీరని లోటు అని తెలియచేసింది. ఈ మేరకు అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బద్ధుల బాబూరావు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చింతల రవీంద్రనాధ్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలమల్లేశ్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు వి మల్లేష్ యాదవ్, ఎడ్ల హరిబాబు యాదవ్, కార్యదర్శులు చిట్టబోయిన లడ్డు యాదవ్, కన్నె రమేష్ యాదవ్, యువజన అధ్యక్షులు రమేష్ యాదవ్, జాతీయ యువజన సమన్వయకర్త గొర్ల యశ్వంత్ యాదవ్, న్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్కోల్ మహేందర్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు విజయ్ యాదవ్ తదితరులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, హుడా డైరెక్టర్ గా, పలు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధిగా అందించిన సేవలు విశేషమని తెలిపారు. మల్లయోధుడుగా విశేషంగా రాణించడమే కాకుండా ఎంతో మంది యువతకు కుస్తీ పోటీల్లో శిక్షణ ఇచ్చారని గుర్తు చేశారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி