పయనీర్ బిల్డర్స్, పెయింట్స్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధికల్పనాధికారి అమరపురి వందన బుధవారం తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న నిరుద్యోగ యువత ధ్రువపత్రాలతో నేరుగా విజయ నగర్ కాలనీలోని కార్యాలయంలో హాజరుకావాలన్నారు.