టోలీచౌకీ ఫ్లై ఓవర్ సుందరీకరణకు నిధులు మంజూరయ్యాయని కార్వాన్ ఎమ్మెల్యే కౌసార్ మొహియుద్దీన్ తెలిపారు. గురువారం ననాల్ నగర్ డివిజన్ పరిధిలోని టోలీచౌకి ఫ్లై ఓవర్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే గురువారం పరిశీలించారు. త్వరగా పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. స్థానికంగా ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు.