రాష్ట్రంలో కులగణనపై బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ లో నిర్వహిస్తున్న సదస్సుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. పార్టీ కీలక నేతలతో పాటు 400 మందిని మాత్రమే సెంటర్ లోకి అనుమతించారు. సెంటర్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలు, నిరుద్యోగులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.