మహానగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఇళ్లలోకి నీరు పోటెత్తడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు సిబ్బంది చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్ పరిధి కృష్ణ నగర్లో భారీ వర్షానికి ఇంటిముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఇంట్లోకి వచ్చిన నీటిని తొడేస్తూ కాలని వాసులు ఇబ్బందులు పడుతున్నారు.