ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణ శనివారం ముగిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయనను దాదాపు 2 గంటలకు పైగా విచారించారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని జైపాల్ తెలిపారు. కాగా ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ను పోలీసులు విచారించారు.