ప్రజలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని షేక్ పేట్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ రషీద్ అన్నారు. శుక్రవారం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కార్పొరేటర్ సమావేశం అయ్యారు. డివిజన్ పరిధిలో ఉన్న అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అభివృద్ది పనులు సకాలంలో పూర్తి అయ్యేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.