తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి సంబంధించిన లోగోను శుక్రవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వెంకట నరేందర్ రెడ్డి, వీసీలు ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, గంటా చక్రపాణి, గంగాధర్, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, తదితరులు పాల్గొన్నారు.