Oct 30, 2024, 12:10 IST/
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
Oct 30, 2024, 12:10 IST
TG: దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కరువు భత్యాన్ని (డీఏ) 3.64 శాతం పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు.