తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమైన పరిపాలన సాగిస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి, వసూళ్లు విచ్ఛలవిడిగా జరుగుతున్నాయని, అదే సమయంలో అడ్మినిస్ట్రేషన్ మాత్రం సరిగ్గా కొనసాగడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణలోని కొన్ని అంశాలు అవినీతిమయమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టులు, కమీషన్ల దందా సాగుతుందని విమర్శించారు.