దూద్ బౌలిలో ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ సలీం అధికారులతో కలిసి శుక్రవారం పర్యటించారు. పలు ప్రాంతాల్లో ఉన్న పెండింగ్ అభివృద్ది పనులను పరిశీలించారు. పనులను త్వరగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.