నీటి కాలుష్య సమస్యలపై మరమ్మతులు చేపట్టినట్లు బహదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ తెలిపారు. శనివారం నవాబుంట డివిజన్ పరిధిలోని సంజీవ్ గాంధీ నగర్ లో కొనసాగుతున్న మరమ్మతులను పరిశీలించారు. అత్యాధునిక మిషన్ సహాయంతో సమస్యను గుర్తించామని, త్వరగా పనులను పూర్తి చేసి సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని
సిబ్బందికి సూచించారు.