కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వర్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెడుతోందని ఒవైసీ సోమవారం మండిపడ్డారు. ముస్లింలు లేకుండా చేయాలని ప్రధాని మోదీ సర్కార్ చూస్తోందని దుయ్యబట్టారు.. మసీద్లు, దర్గాలలాగే వక్స్ ఆస్తులు కూడా ప్రభుత్వ ఆస్తులు కావని, ఎప్పటి నుంచో ఉన్న వక్స్ ఆస్తులకు డీడ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మక్కా మసీదు డీడ్ కావాలంటే ఎక్కడ తేవాలని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు.