కిషన్ బాగ్ డివిజన్ పరిధిలో బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ శనివారం పర్యటించారు. పలు కాలనీలలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీలు, రోడ్ల సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నూతన రోడ్డు పనులు, డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.