పూరనపూల్ లో కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువ అవుతోంది. స్థానికంగా శివ నగర్లోని సమ్మక్క సారక్క వైన్స్ షాపు నుంచి బస్తీ దవాఖానకు వెళ్లే మార్గంలో ఓ గల్లీలో కుక్కలు స్ధైర్యవిహారం చేస్తున్నాయి. అటువైపు ఎవరైనా వస్తె వెంటపడి అరుస్తూ భయందోళనకు గురి చేస్తున్నాయి. వీటిని నియంత్రించాలని గతంలో జీహెచ్ఎంసీ కి పిర్యాదు చేసిన పట్టించుకోలేదని, ఇకనైనా స్పందించి కుక్కలను ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.