21 ఏళ్లపాటు ఛైర్మన్‌గా పని చేసిన రతన్ టాటా.. తన హయాంలో టాటా గ్రూప్‌ను భారీగా విస్తరించారు. ఆయన హయాంలో గ్రూప్ ఆదాయం 40 రెట్లు, లాభాలు 50 రెట్లు పెరిగాయి. 2016 అక్టోబరు 24వ తేదీన మిస్త్రీని తొలగించి మళ్లీ రతన్ టాటా, టాటా గ్రూప్‌నకు తాత్కాలిక ఛైర్మన్ అయ్యారు. 2017 జనవరి 12వ తేదీన నటరాజన్ చంద్రశేఖరన్‌ను గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్ ఛైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి రతన్ టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.