డిపాజిట్‌దారుడు మరణించాక క్లెయిం మొత్తాన్ని నామినీ/చట్టపరమైన వారసులకు అందజేస్తారు. కానీ, క్లెయిం మొత్తం రూ.5 లక్షలు దాటితే క్లెయిమ్‌దారుడు తప్పనిసరిగా కోర్టు నుంచి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. నామినీ మరణించిన సందర్భంలో చట్టపరమైన వారసుడికి కాకుండా, మరణించిన నామినీకి సంబంధించిన చట్టపరమైన వారసునికి అనుకూలంగా ఖాతా క్లెయిమ్ దక్కుతుంది. సాక్ష్యాలు లేనప్పుడు ఆరు నెలల తర్వాత క్లెయిమ్ దాఖలు చేయొచ్చు.