తెలంగాణలో మొత్తం 243 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఓసీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీల వారీగా ఎన్ని కులాలున్నాయో కూడా వెల్లడించింది. సర్వేలో వివరాలను సేకరించేందుకు ఆయా కులాలకు కోడ్‌లు కేటాయించింది. రాష్ట్రంలో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రత్యేక కోడ్ లు కేటాయించింది. అయితే, తమకు ఏ కులం, మతం లేదని చెప్పేవారినీ ప్రత్యేక కోడ్ కింద పరిగణిస్తోంది.