1969లో జపాన్‌లోని టోక్యోలో జరిగిన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సమావేశంలో మొదట ఈ ప్రపంచ తపాలా దినోత్సవం ప్రకటించబడింది. భారత ప్రతినిధి బృందంలో సభ్యుడైన శ్రీ ఆనంద్ మోహన్ నరులా ఈ ప్రతిపాదనను సమర్పించారు. అప్పటి నుండి, తపాలా సేవల అవసరాన్ని గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 9 న ఈ ప్రపంచ తపాలా దినోత్సవమును జరుపుకుంటున్నారు.