హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు గాయం అయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జిమ్‌లో 80 కేజీల బరువును లిఫ్ట్ చేసే క్రమంలో ఆమె వెన్నుముకకు గాయం అయినట్లుగా సమాచారం. డాక్టర్లు ఆమెను పరిశీలించి కొన్ని వారాల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని సూచించారు. ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్న ఈ బ్యూటీ ఓ వీడియోను షేర్ చేసింది.