TG: మరికాసేపట్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. అవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ సూచించింది. అయితే గత నాలుగు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.