దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసును సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ కేసును విచారించిన సీల్దా కోర్టు దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు ఇప్పటికే జీవిత ఖైదు విధించింది. అయితే దోషికి మరణశిక్ష విధించాలని యువతి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో వేచి చూడాలి.