ఏ దరఖాస్తు లేకుండా BRS ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ సర్కార్ రుణమాఫీకి షరతులు పెట్టి లబ్ధిదారులను తగ్గించిందని విమర్శించారు. 'రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాపీ పూర్తి కాలేదు. రైతు భరోసాకు షరతులు పెడుతున్నారు. రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారంట. రైతులను మళ్లీ కార్యాలయాలు, కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.