TG: గ్రూప్ –1 పోస్టుల ధ్రువపత్రాల వెరిఫికేషన్ తేదీలను తాజాగా టీజీపీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపింది. అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలు ఉంటాయని, ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాలతో వెరిఫికేషన్‌కు రావాలని పేర్కొంది.