మాది చేతల ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

77பார்த்தது
మాది చేతల ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
TG: మాది మాటలతో కాదు.. చేతలతో చేసి చూపించే ప్రభుత్వమ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌లో సమీకృత గురుకుల పాఠశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదని విమర్శించారు. పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.

தொடர்புடைய செய்தி