బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు సమర్థవంతంగా పనిచేశాయని మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ అసెంబ్లీలో అన్నారు. గతంలో అమెరికా వెళ్లి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకునేవారు ఎక్కువగా ఉండగా.. మా ప్రభుత్వ హయాంలో 609 ట్రాన్స్‌ప్లాంట్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయించాం. ఒక్కో కేసుకు రూ.20 లక్షల ఖర్చును భరించి, సామాన్యులకు అవయవ మార్పిడి సేవలు అందించాం. అని హరీశ్ రావు అన్నారు.