హెచ్సీయూ భూములపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు.పర్యావరణ పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లు కూల్చారు, అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు, ఇపుడు జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా? అని ప్రశ్నించారు. విధ్వంసం, ఖజానా నింపుకోవడమే మీ నినాదమా అని తెలంగాణ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.