జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికకు పుట్టుకతో కాళ్లు, చేతులు లేవు. అయితే పారాలింపిక్స్‌లో శీతల్‌దేవి ప్రదర్శన చూసి, ఆమె కూడా ఆర్చరీలో శిక్షణ తీసుకోవాలనుకుంది. ఆమె ఆసక్తిని గమనించి, శీతల్‌కి ఆర్చరీలో శిక్షణ ఇచ్చిన కోచ్ కుల్దీప్ వెద్వాన్ ఆమెకు కూడా శిక్షణ ఇవ్వడానికి ముందుకువచ్చారు. కాగా, ఆ బాలిక విలువిద్యలో శిక్షణ పొందుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.