గుండెపోటు అనేది ఇప్పుడు ఆరోగ్య వంతులకు కూడా ప్రధాన సమస్యగా మారింది. వారిలో జన్యుపరమైన లోపాలు లేదా డీహైడ్రేషన్ లాంటి కారణాలతో కొన్నిసార్లు గుండె మరీ వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. గాఢ నిద్రలో శరీరంలో కార్టిసోల్ హార్మోన్ మరీ ఎక్కువగా ఉత్పత్తయినప్పుడు, గుండె వేగాన్ని నియంత్రించే ఎసిటైల్కోలీన్ హార్మోన్ లో అసమతుల్యత ఏర్పడినప్పుడు, స్లీప్ ఆప్నియా లాంటి కారణాల వల్ల కూడా నిద్రలో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.