మక్తల్: రైతు భరోసా కింద రైతులకు రూ. 15, 000, కౌలు రైతులకు రూ. 12, 000 ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి సోమవారం ఆరోపించారు. ఆత్మకూరు పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.